3 రోజుల్లో మూడు దారుణాలు...

ABN , First Publish Date - 2021-08-21T07:47:42+05:30 IST

మహిళలపై అఘాయిత్యాలు, హింస జరిగితే గన్‌ కంటే ముందే జగన్‌ వస్తాడని ఊదరగొట్టిన పాలకుల్లో రాష్ట్రంలో వరుసగా అమానుషాలు ..

3 రోజుల్లో మూడు దారుణాలు...

జ‘గన్‌’ ఎక్కడ!?: లోకేశ్‌ 

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మహిళలపై అఘాయిత్యాలు, హింస జరిగితే గన్‌ కంటే ముందే జగన్‌ వస్తాడని ఊదరగొట్టిన పాలకుల్లో రాష్ట్రంలో వరుసగా అమానుషాలు చోటు చేసుకుంటున్నా చలనమే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ‘గన్నూ లేదు.. జగనూ రావడం లేదు’ అని ఎద్దేవా చేశారు. ‘‘మొన్న ఇంజనీరింగ్‌ విద్యార్థిని రమ్య హత్య... నిన్న బాలికపై మానవ మృగం దాడి... నేడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దారుణం. ఇలా మహిళలపై వరుసగా అకృత్యాలు, ఘోరాలు జరుగుతున్నా సీఎం జగన్‌లో అణుమాత్రమైనా స్పందన లేదు’’ అని లోకేశ్‌ దుయ్యబట్టారు. కనీసం బాధితులను పరామర్శించేందుకూ ఆయనకు మనసు రావడం లేదన్నారు. ‘‘గుంటూరులో నడిరోడ్డుపై రమ్యను దారుణంగా హతమార్చిన ఘటన జరిగి అప్పుడే 5 రోజులు గడిచిపోయాయి. ‘దిశ’ చట్టం కింద హంతకుడికి శిక్ష పడేందుకు ఇక 16 రోజులే మిగిలాయి. అతడికి శిక్ష పడేదెప్పుడు?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2021-08-21T07:47:42+05:30 IST