తక్షణమే పరీక్షలు రద్దు చేయాలి: లోకేష్‌

ABN , First Publish Date - 2021-06-23T01:17:01+05:30 IST

ఏపీ ప్రభుత్వం తక్షణమే పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ నాయకుడు

తక్షణమే పరీక్షలు రద్దు చేయాలి: లోకేష్‌

అమరావతి: ఏపీ ప్రభుత్వం తక్షణమే పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ నాయకుడు లోకేష్‌ డిమాండ్ చేశారు. మొండిగా పరీక్షలు నిర్వహిస్తామంటోన్న ఏపీ ప్రభుత్వ తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిందని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా పరీక్షలు రద్దు చేస్తే ఏపీలో మాత్రమే నిర్వహించి తీరుతామని ఎందుకు పట్టుపడుతున్నారో అర్థం కావడంలేదని లోకేష్‌ పేర్కొన్నారు. మూర్ఖపు ఆలోచనలతో లక్షలాది విద్యార్థుల్ని కొవిడ్‌ కోరల్లోకి నెట్టేందుకు జగన్‌రెడ్డి వెనుకాడటం లేదని లోకేష్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా అఫిడవిట్ వేయలేదని లోకేష్‌ విమర్శించారు. పోయిన ప్రాణాలు జగన్‌రెడ్డి తిరిగి తేగలరా అని లోకేష్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-23T01:17:01+05:30 IST