కర్నూలులో లోకాయుక్త కార్యాలయం

ABN , First Publish Date - 2021-08-29T09:40:29+05:30 IST

రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త

కర్నూలులో లోకాయుక్త కార్యాలయం

ప్రారంభించిన జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి


కర్నూలు లీగల్‌, ఆగస్టు 28: రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు. కార్యక్రమంలో లోకాయుక్త రిజిస్ర్టార్‌ ఎం.విజయలక్ష్మి, కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-29T09:40:29+05:30 IST