ఏపీలో మద్యం ధరలు తగ్గించాలి: విష్ణుకుమార్‌రాజు

ABN , First Publish Date - 2021-12-31T23:48:57+05:30 IST

ఏపీలో మద్యం ధరలు తగ్గించాలని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఏపీలో మద్యం ధరలు తగ్గించాలి: విష్ణుకుమార్‌రాజు

విశాఖ: ఏపీలో మద్యం ధరలు తగ్గించాలని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ ధరలు తగ్గించి మద్యం ధరలు పెంచడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ విషయంపై సోమువీర్రాజు వ్యాఖ్యలను పెడార్ధాలు తీస్తున్నారని తప్పుబట్టారు. ఎక్కడా కనిపించని మద్యం బ్రాండ్స్ ఏపీలో ఉన్నాయన్నారు. కష్టపడి పనిచేసే వారినుంచి మద్యం పేరుతో జగన్ సర్కార్ దోచుకుంటోందని దుయ్యబట్టారు. మద్యం బ్రాండ్స్ చాలా తక్కువ ధరకు కొనుగోలుచేసి... 10 రెట్లకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. 


‘‘అన్నిరాష్ట్రాల్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే.. ఏపీలో జగన్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంత వరకు రాక్షస పాలనభరించాం. ఇకభరించే ఓపిక మాకు లేదు. వచ్చే ఏడాది రాజకీయ ఒడిదుడుకులు జగన్‌కి తప్పదని భావిస్తున్నాం. ఇదే విధంగా ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కి 15 సీట్లు కూడా రావు. ఎప్పుడు ఎవరు జైల్‌కి వెళ్తారో నాకు తెలియదు. ఎక్కువ రోజులు బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగనే’’ విష్ణుకుమార్‌రాజు తెలిపారు.

Updated Date - 2021-12-31T23:48:57+05:30 IST