‘పశ్చిమ’లో లిక్విడ్‌ గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-12-26T08:51:53+05:30 IST

‘పశ్చిమ’లో లిక్విడ్‌ గంజాయి పట్టివేత

‘పశ్చిమ’లో లిక్విడ్‌ గంజాయి పట్టివేత

భీమడోలు, డిసెంబరు 25: గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.5 లక్షల విలువైన 6.25 కేజీల లిక్విడ్‌ గంజాయి ప్యాకెట్లను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో ఎస్‌ఈబీ ఏఎస్పీ జయరామరాజు వెల్లడించిన వివరాలు... శుక్రవారం గుండుగొలను హైవేపై తనిఖీ చేస్తుండగా రాజమహేంద్రవరానికి చెందిన కొలపలి శ్రీజ్యోతి భాస్కర శ్రీధర్‌ బైక్‌పై లిక్విడ్‌ గంజాయిని తీసుకువెళుతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. సందీప్‌ అనే వ్యక్తి ఆదేశాలతో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు.

Updated Date - 2021-12-26T08:51:53+05:30 IST