సాయుధ బలగాల చట్టాన్ని ఎత్తేయండి: నారాయణ

ABN , First Publish Date - 2021-12-08T08:03:54+05:30 IST

సాయుధ బలగాల చట్టాన్ని ఎత్తేయండి: నారాయణ

సాయుధ బలగాల చట్టాన్ని ఎత్తేయండి: నారాయణ

పుత్తూరు, డిసెంబరు 7: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం ప్రజాస్వామ్య విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తమ పార్టీ మొదటి నుంచీ ఈ చట్టాన్ని తీసివేయాలని డిమాండ్‌ చేస్తున్నదని గుర్తు చేశారు. బీజేపీ పాలనలో అకారణంగా కాల్పులు జరపడం ఆ తర్వాత ప్రధాని, హోంమంత్రి క్షమాపణలు చెప్పడం రివాజుగా మారిందని ఆక్షేపించారు. ఇలాంటి సంఘటనలు దేశానికి అప్రతిష్ట అని, ఇకనైనా ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల చట్టాన్ని తొలగించాలని కోరారు.

Updated Date - 2021-12-08T08:03:54+05:30 IST