ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించేలా చర్యలు చేపట్టండి : Ramakrishna
ABN , First Publish Date - 2021-10-29T13:25:07+05:30 IST
సీఎం జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించేలా చర్యలు చేపట్టండంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఎయిడెడ్ విద్యాలయాలకు
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించేలా చర్యలు చేపట్టండంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఎయిడెడ్ విద్యాలయాలకు ఇస్తున్న గ్రాంటులను ప్రభుత్వం నిలిపివేయడం దుర్మార్గమని, ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటీకరిస్తే ఫీజుల భారం పెరిగిపోతుందని లేఖలో పేర్కొన్నారు. విద్యారంగ బాధ్యతను విస్మరించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండటం విచారకం అని, ఇప్పటికే ఎయిడెడ్ విద్యాలయాల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయని రామకృష్ణ లేఖలో వివరించారు.