రాష్ట్రంలో లా అండ్ అర్డర్ బ్రేక్ డౌన్: యనమల
ABN , First Publish Date - 2021-10-21T10:03:14+05:30 IST
అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కై, ఏపీని గూండా రాజ్‌గా మార్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కై, ఏపీని గూండా రాజ్‌గా మార్చారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. లా అండ్ అర్డర్ బ్రేక్ డౌన్‌కు వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సహంతోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్టికల్ 356 వినియోగించి, ఏపీలో పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.