రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు: లాల్ సింగ్ ఆర్య

ABN , First Publish Date - 2021-11-28T20:10:22+05:30 IST

అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య ప్రకటించారు.

రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు: లాల్ సింగ్ ఆర్య

అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు  లాల్ సింగ్ ఆర్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసిన అమరావతికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్‌‌ని ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అయితే... అంబేద్కర్‌కి భారతరత్న అవార్డు రావడానికి ఎంతో కృషి చేశామన్నారు. 57 ఏళ్లు కాంగ్రెస్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరగలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను జగన్ సర్కార్ మళ్లించిందని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో దళిత ఆదివాసీల హత్యలు, మతమార్పిడులు జరుగుతున్నాయని లాల్ సింగ్ ఆర్య తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-11-28T20:10:22+05:30 IST