Kurnool: రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-10-28T13:19:23+05:30 IST

కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన ప్రభుత్వ రేషన్‌ బియ్యాన్ని ఎస్‌ఐ ముబీనాతాజ్‌ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఆమె తెలిపిన వివరాల మేరకు ప్రభుత్వం పేద బడుగు

Kurnool: రేషన్‌ బియ్యం పట్టివేత

కర్నూలు: కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన ప్రభుత్వ రేషన్‌ బియ్యాన్ని ఎస్‌ఐ ముబీనాతాజ్‌ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఆమె తెలిపిన వివరాల మేరకు ప్రభుత్వం పేద బడుగు బల హీన వర్గాలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన అలి అక్బర్‌ అనే వ్యక్తి కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామంలో ఓ ముస్లిం మహిళ ఇంట్లో 50 కేజీలు గల సుమారు 200 ప్యాకెట్ల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా ఉన్నట్లు తెలిపారు.  200 ప్యాకెట్ల బియ్యాన్ని పట్టుకుని తహసీల్దార్‌ శ్రీనివాసులు సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచుకున్న మహిళ పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2021-10-28T13:19:23+05:30 IST