రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-10-25T12:21:57+05:30 IST
ఆళ్లగడ్డ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రూరల్ ఎస్‌ఐ నరసింహుడు తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోపాల్,

కర్నూలు: ఆళ్లగడ్డ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రూరల్ ఎస్‌ఐ నరసింహుడు తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోపాల్, పృద్విరెడ్డి మైదు కూరుకు మోటార్ సైకిల్‌పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా నంద్యాల నుంచి ఆళ్లడ్డకు మోటార్ సైకిల్ వెళ్తున్న మరో వ్యక్తి పేరాయిపల్లె మెట్ల వద్ద వీరి వాహనాన్ని ఢీకొనడంతో గోపాల్, పృద్విరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించగా, వైద్యుల సూచనల మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోపాల్(65) మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. ఢీకొట్టిన మోటార్‌సైకిస్టు పారిపో యాడని, ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు.