కుప్పంలో పెక్సీల రగడ కలకలం
ABN , First Publish Date - 2021-10-29T17:04:21+05:30 IST
కుప్పంలో పెక్సీల రగడ కలకలం రేపుతోంది. లక్ష్మీపురం గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ బ్యానర్లు చింపేశారు.

చిత్తూరు: కుప్పంలో పెక్సీల రగడ కలకలం రేపుతోంది. లక్ష్మీపురం గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ బ్యానర్లు చింపేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు బస చేయనున్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద టీడీపీ శ్రేణులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత చంద్రబాబు పర్యటనలోనూ దుండగులు ప్లెక్సీలు చింపివేశారు. వైసీపీ నాయకులు కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీల జోలికి టీడీపీ వెళ్లలేదు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను చింపివేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.