పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న రైతు

ABN , First Publish Date - 2021-01-20T14:07:09+05:30 IST

జిల్లాలో ఘోరం జరిగింది. అప్పుల బాధ తాళలేక రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చందర్లపాడులో చోటు చేసుకుంది...

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న రైతు

కృష్ణా: జిల్లాలో ఘోరం జరిగింది. అప్పుల బాధ తాళలేక రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని చందర్లపాడులో  చోటు చేసుకుంది. కట్టా లక్ష్మీ నారాయణ అనే రైతుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణ వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కౌలుకు 28 ఎకరాలు మాగణీ తీసుకున్నాడు. దాంట్లో వేసిన పంట సరిగ్గా పంట చేతికి రాకపోవడంతో..మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో తను చేసిన అప్పుల బాధను భరించలేక రైతు కట్టా లక్ష్మీనారాయణ తన పంట పొలంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లెటర్ ఇలా రాసాడు. వైఎస్ జగన్ మోహన్ గారు పత్తి యార్డులో చావాలని 25 నిద్రమాత్రలు మింగి గాను..అయినా నేను చావలేదని, మీకు అన్ని వివరాలతో లెటర్స్ రాసాను. నా కుటుంబ సభ్యులు దాచినారో, చించినారో నాకు తెలియదు. నేను మొండి వాడను ఇప్పుడు ఇక్కడ నా చావును ఎవరు  ఆపుతారు అని లెటర్‎లో తెలిపాడు. వైయస్సార్ పార్టీ అభిమానిని అంటూ కౌలు రైతు కష్టాలు నాకు తెలుసంటూ లేఖ‎లో రైతు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-20T14:07:09+05:30 IST