ఎస్పీ రాజకుమారికి ‘కొవిడ్‌ వారియర్‌’ అవార్డు

ABN , First Publish Date - 2021-02-01T08:32:29+05:30 IST

కరోనా మహమ్మారి కట్టడి కోసం జరిపిన పోరులో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారికి అరుదైన గౌరవం దక్కింది.

ఎస్పీ రాజకుమారికి ‘కొవిడ్‌ వారియర్‌’ అవార్డు

న్యూఢిల్లీ, విజయనగరం క్రైం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కట్టడి కోసం జరిపిన పోరులో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కరోనా నియంత్రణలో అత్యుత్తమ సేవలందించిన రాజకుమారికి ‘కరోనా మహిళా వారియర్‌’ అవార్డు ప్రదానం చేసిన జాతీయ మహిళా కమిషన్‌ ఆమెను ఘనంగా సత్కరించింది. జాతీయ మహిళా కమిషన్‌ చైౖర్‌పర్సన్‌ రేఖా శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఆ సంస్థ 29వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, రతన్‌లాల్‌ కటారియా.. ఎస్పీ రాజకుమారికి ‘కొవిడ్‌ మహిళా వారియర్‌’ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీ మహిళా కమిషన్‌ సభ్యులు శిరిగినీడి రాజ్యలక్ష్మి, తమ్మిశెట్టి రమాదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-01T08:32:29+05:30 IST