31వరకూ పరిశ్రమల్లో కొవిడ్ నిబంధనలు
ABN , First Publish Date - 2021-05-20T09:35:59+05:30 IST
రాష్ట్రంలో విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో పరిశ్రమల నిర్వహణకు గతంలో జారీ చేసిన నిబంధనలు కూడా అప్పటివరకూ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో పరిశ్రమల నిర్వహణకు గతంలో జారీ చేసిన నిబంధనలు కూడా అప్పటివరకూ అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షిఫ్ట్‌ల కుదింపు, అత్యవసర, నిత్యావసర పరిశ్రమలకు మినహాయింపు, ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీ తదితర నిబంధనలన్నీ ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.