జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు : కోరుముట్ల

ABN , First Publish Date - 2021-05-20T23:53:23+05:30 IST

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని ..

జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు : కోరుముట్ల

అమరావతి : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్ధిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా.. సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు జరిపామన్నారు. ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రభుత్వం తమదని.. కరోనా కష్టకాలంలో చికిత్స కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు పక్క రాష్ట్రంలో దాక్కున్నారు. మాక్ అసెంబ్లీ పేరుతో అర్ధం లేని విమర్శలు చేసేందుకు సిద్దపడుతున్నారు. ఎస్సీలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపారు. ప్రతిపక్షాలు ప్రజలకు అండగా నిలబడటంలో విఫలమయ్యాయిఅని కోరుముట్ల విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-05-20T23:53:23+05:30 IST