ఏఐసీసీ అనుబంధ సంఘాల కోఆర్డినేటర్‌గా కొప్పుల రాజు
ABN , First Publish Date - 2021-12-26T08:30:14+05:30 IST
ఏఐసీసీ అనుబంధ సంఘాల కోఆర్డినేటర్‌గా కొప్పుల రాజు

న్యూఢిల్లీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయా అనుబంధ సంఘాల కోఆర్డినేటర్‌గా సీనియర్ నేత కొప్పుల రాజు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కోఆర్డినేటర్‌గా ఆయన.. ఏఐసీసీ ఎస్సీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలతో పాటు ఆదివాసీ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారన్నారు. అలాగే, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా రాజేశ్ లిలోథియా నియమితులయ్యారు.