‘కోడికత్తి’ నిందితుడి బెయిల్‌ తీర్పు రిజర్వ్‌

ABN , First Publish Date - 2021-05-05T09:01:18+05:30 IST

వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (రెండో అదనపు జిల్లా జడ్డి) రిజర్వ్‌ చేసింది

‘కోడికత్తి’ నిందితుడి బెయిల్‌ తీర్పు రిజర్వ్‌

విజయవాడ, మే 4 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (రెండో అదనపు జిల్లా జడ్డి) రిజర్వ్‌ చేసింది. శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 2.8 ఏళ్లుగా ఉంటున్నారు. పలుమార్లు ఆయన తరఫున న్యాయవాది బెయిల్‌ పిటిషన్లను దాఖలు చేశారు. తాజాగా గత నెల 24న మరో పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టులో దాఖలు చేశారు. శ్రీనివాస్‌ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ మంజూరు చేస్తే ఆయన వారిని దగ్గరుండి చూసుకొంటారని పిటిషన్‌లో తెలిపారు. దీనిపై కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. 

Updated Date - 2021-05-05T09:01:18+05:30 IST