కొడవలిలో బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం

ABN , First Publish Date - 2021-12-19T08:09:55+05:30 IST

కొడవలిలో బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం

కొడవలిలో బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలిలోని బౌద్ధ మహాస్థూపం వద్ద శనివారం భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలతో పాటు మయన్మార్‌కు చెందిన బౌద్ధ బిక్షువులు, భిక్కు సంఘం ప్రతినిధులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ప్రదర్శనగా సభాస్థలికి చేరుకున్న భిక్షువులు.. అక్కడ బుద్ధ విగ్రహానికి వందనం చేశారు. అనంతరం నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ బౌద్ధ క్షేత్రాలు, ఆరామాలు అన్యాక్రాంతమవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వీటిని పర్యాటక ప్రాంతాలుగా చూడొద్దని, ప్రాశస్త్యాన్ని గుర్తించాలని కోరారు. - గొల్లప్రోలు రూరల్‌

Updated Date - 2021-12-19T08:09:55+05:30 IST