బస్సు ప్రమాద ఘటనపై కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2021-12-15T22:06:28+05:30 IST
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన బస్సు

ఢిల్లీ: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ సీఎస్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.