రైతులకు ‘కిసాన్‌ తత్కాల్‌’ రుణాలు

ABN , First Publish Date - 2021-12-19T09:05:36+05:30 IST

రైతులకు ‘కిసాన్‌ తత్కాల్‌’ రుణాలు

రైతులకు ‘కిసాన్‌ తత్కాల్‌’ రుణాలు

యూనియన్‌ బ్యాంక్‌ సీజీఎం బ్రహ్మానందరెడ్డి

గుంటూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌, తుఫాన్‌, వరదలతో బలహీనపడిన ఆర్థిక లావాదేవీలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కిసాన్‌ తత్కాల్‌ పేరుతో రాష్ట్రంలో రైతులకు రూ.50 వేల చొప్పున అదనంగా పంట రుణాలిస్తున్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ సీజీఎం, లీడ్‌ బ్యాంక్‌ రాష్ట్ర కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బ్యాంక్‌ రీజనల్‌ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాడి గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. బంగారం తాకట్టు రుణాలకు పరిమితిలేదని.. పట్టాదారు పాసు పుస్తకం లేకపోయినా రైతులు భూమికి సంబంధించిన ఏ ధృవీకరణ పత్రంతోనైనా గోల్డ్‌ లోన్లు తీసుకోవచ్చని స్పష్టంచేశారు. కౌలు రైతుల గుర్తింపు కార్డులు కూడా బంగారం తాకట్టు రుణాలకు సరిపోతాయన్నారు.

Updated Date - 2021-12-19T09:05:36+05:30 IST