చాట్రాయి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2021-01-17T09:19:06+05:30 IST
చాట్రాయి ఎస్ఐ శివనారాయణను సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనానాథ్బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
చాట్రాయి, జనవరి 16: చాట్రాయి ఎస్ఐ శివనారాయణను సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనానాథ్బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల చాట్రాయి మండలంలో కోడిపందేలు, పేకాట శిబిరాలపై ఎస్ఐ దాడులు చేయడంతోపాటు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో వారిపై కేసులు నమోదు చేయలేదు. ఎస్ఐ పనితీరుపై ఎస్పీకి ఫిర్యాదులు రాగా... అవి నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు.