విశాఖ ఎక్సిక్యూటివ్ కేపిటల్ అని జగన్ అన్నారో లేదో..: కేశినేని నాని

ABN , First Publish Date - 2021-02-06T18:27:13+05:30 IST

అమరావతి: విశాఖ ఉక్కులో లాభనష్టాలు చూడకూడదని విజయవాడ ఎంపీ, కేశినేని నాని పేర్కొన్నారు.

విశాఖ ఎక్సిక్యూటివ్ కేపిటల్ అని జగన్ అన్నారో లేదో..: కేశినేని నాని

అమరావతి: విశాఖ ఉక్కులో లాభనష్టాలు చూడకూడదని విజయవాడ ఎంపీ, కేశినేని నాని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన 32 మంది కాల్పుల్లో మరణించారన్నారు. రాష్ట్ర విభజనలోనూ ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. విభజన హామీలు సాధిస్తామని జగన్ చెప్పి మోసం చేసి కేంద్రంతో లాలూచీ పడ్డారన్నారు. అనేక సందర్భాల్లో కేంద్రానికి వైసీపీ మద్దతు తెలిపిందని కేశినేని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు విషయంలో రాజీనామా చేయాల్సింది ఎంపీ సత్యనారాయణ మూర్తి కాదని పేర్కొన్నారు. విజయసాయి దీనిపై స్పందించి.. బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఎక్సిక్యూటివ్ కేపిటల్ అని జగన్ అన్నారో లేదో అక్కడ ఉక్కు మాయం అవుతోందని విమర్శించారు. విశాఖ ఉక్కును రిస్టోర్ చేయడానికి తాము ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని.. కలిసి పోరాటం చేస్తామని కేశినేని నాని తెలిపారు.

 

Updated Date - 2021-02-06T18:27:13+05:30 IST