హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కేశినేని ఓటుతో టీడీపీ ఖాతాలోకి కొండపల్లి?

ABN , First Publish Date - 2021-11-22T04:34:25+05:30 IST

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్ ఎన్నికల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేసింది. అత్యవసర విచారణ చేయాలని ....

హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కేశినేని ఓటుతో టీడీపీ ఖాతాలోకి కొండపల్లి?

అమరావతి: కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్ ఎన్నికల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేసింది. అత్యవసర విచారణ చేయాలని పురపాలక ముఖ్య కార్యదర్శి కోరారు. అత్యవసర విచారణకు హైకోర్టు సీజే నిరాకరించారు. ఎక్స్‌ అఫిషియో ఓటును వినియోగించుకునేలా అనుమతించాలని ఎంపీ కేశినేని నాని సింగిల్ జడ్జి ముందు పిటిషన్ వేశారు. ఓటు వేసేందుకు ఎంపీకి అనుమతి ఇస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ సమానంగా వార్డులు గెలిచాయి. ఎంపీ కేశినేని ఓటుతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 


Updated Date - 2021-11-22T04:34:25+05:30 IST