స్వర్ణాలంకరణలో కన్యకాపరమేశ్వరి

ABN , First Publish Date - 2021-08-21T08:53:38+05:30 IST

శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా విశాఖపట్నం వన్‌టౌన్‌ కురుపాం మార్కెట్‌ ప్రాంతంలో కొలువుదీరిన కన్యకాపరమేశ్వరి అమ్మవారు స్వ

స్వర్ణాలంకరణలో కన్యకాపరమేశ్వరి

మహారాణిపేట (విశాఖపట్నం), ఆగస్టు 20: శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా విశాఖపట్నం వన్‌టౌన్‌ కురుపాం మార్కెట్‌ ప్రాంతంలో కొలువుదీరిన కన్యకాపరమేశ్వరి అమ్మవారు స్వర్ణాభరణ అలంకృతగా, దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని సువర్ణ వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించిన అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అమ్మవారి మూలవిరాట్‌కు పాలు, పండ్లరసాలు, 108 రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-08-21T08:53:38+05:30 IST