పక్కాగా పంట నష్టం అంచనా వేయాలి: కన్నబాబు

ABN , First Publish Date - 2021-07-24T08:02:49+05:30 IST

వర్షాలు తగ్గగానే పంట నష్టాన్ని పక్కాగా అంచనా వేయాలని, రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందించాలని, రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు

పక్కాగా పంట నష్టం అంచనా వేయాలి: కన్నబాబు

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): వర్షాలు తగ్గగానే పంట నష్టాన్ని పక్కాగా అంచనా వేయాలని, రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందించాలని, రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీఐఐసీలో వర్షాల వల్ల నష్టాలు, విత్తనోత్పత్తి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేల ద్వారా విత్తనోత్పత్తి చేస్తామని, విత్తనం పండించే ప్రతి ఎకరం రిజిస్ర్టేషన్‌ చేస్తామని, హైబ్రీడ్‌ విత్తనోత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

Updated Date - 2021-07-24T08:02:49+05:30 IST