దూషణలే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుంటున్నారు: కన్నా

ABN , First Publish Date - 2021-11-21T21:09:54+05:30 IST

చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలను బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. రాష్ట్రంలో నైతిక విలువలు పూర్తిగా దిగజారి పోతున్నాయని మండిపడ్డారు.

దూషణలే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుంటున్నారు: కన్నా

ప్రకాశం: చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలను బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. రాష్ట్రంలో నైతిక విలువలు పూర్తిగా దిగజారి పోతున్నాయని మండిపడ్డారు. నాయకులు వ్యక్తిగత దూషణలే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దాడులు, దూషించటం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫ్యాక్షనిస్ట్ నియంతృత్వ పోకడలు కనబడుతున్నాయన్నారు. 

Updated Date - 2021-11-21T21:09:54+05:30 IST