ప్రజలను నమ్మించి వైసీపీ అధికారంలోకి వచ్చింది : కన్నా

ABN , First Publish Date - 2021-12-25T19:38:14+05:30 IST

ప్రజలను నమ్మించి వైసీపీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మి నారాయణ విమర్శించారు.

ప్రజలను నమ్మించి వైసీపీ అధికారంలోకి వచ్చింది : కన్నా

గుంటూరు : ప్రజలను నమ్మించి వైసీపీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మి నారాయణ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి, కక్ష్య సాధింపు పాలన సాగిస్తున్నారన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారన్నారు. తాను తప్ప వేరెవ్వరూ ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయకూడదని తరిమి తరిమి కొడుతున్నారన్నారు. జగన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా 28న మహా ధర్నా నిర్వహించనున్నట్టు కన్నా పేర్కొన్నారు.Updated Date - 2021-12-25T19:38:14+05:30 IST