ప్రభుత్వ ఆస్తులను జగన్ తన తాత ఆస్తుల మాదిరిగా తాకట్టు పెడుతున్నారు: కన్నా

ABN , First Publish Date - 2021-10-07T18:16:46+05:30 IST

నియంత, అసమర్ధుడు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్తులను జగన్ తన తాత ఆస్తుల మాదిరిగా తాకట్టు పెడుతున్నారు: కన్నా

గుంటూరు: నియంత, అసమర్ధుడు సీఎం అయితే ఎలా ఉంటుందో జగన్ పాలన చూస్తే తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ పేర్కొన్నారు. జగన్ ఒక్క చాన్స్ తీసుకోని ప్రజలకు బ్రతికే చాన్స్ లేకుండా చేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులను జగన్ వాళ్ల తాత ఆస్తుల మాదిరిగా తాకట్టు పెడుతున్నారని కన్నా విమర్శించారు. అమ్మ ఒడి పేరుతో డబ్బులు ఇచ్చి నాన్న చేతిలో మద్యం బాటిల్ పెట్టి దోచుకుంటున్నారన్నారు. నవరత్నాలు పేరుతో ఓట్లు కొనుకొంటున్నారని విమర్శించారు. ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నాడని... ఏపీని అప్పుల ఆంద్రప్రదేశ్‌‌గా మార్చారని కన్నా పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-07T18:16:46+05:30 IST