కరోనా కట్టడిలో సీఎం జగన్ విఫలం: కందికుంట వెంకటప్రసాద్
ABN , First Publish Date - 2021-05-25T00:51:53+05:30 IST
రాష్ట్రంలో నెలకొన్న నేటి భయానక పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.

అనంతపురం: రాష్ట్రంలో నెలకొన్న నేటి భయానక పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడంలో సీఎం జగన్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కరోనా రోగులను కాపాడేందుకు జిల్లా అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. వారిలో ధైర్యం నింపి , ప్రోత్సహించడంలో రాజకీయ యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా ఉందన్నారు. అనంతపురం జిల్లా మంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆయనకు తెలిసిందల్లా నిత్యం జగన్‌కు భజన చేయడమేనని ఎద్దేవా చేశారు. అనంతపురం సర్వజన ఆస్పత్రి ఓపీ సెంటర్ కరోనా సూపర్ స్ప్రెడ్ సెంటర్‌లా ఉందన్నారు. కోవిడ్ బాధితులకు నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారు... డాక్టర్లు పట్టించుకునే పరిస్థితి లేదని కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.