కనగరాజ్ నియామకం అభ్యంతరకరం: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-06-21T22:28:25+05:30 IST

పోలీసు కంప్లైంట్స్ సెల్ చైర్మన్‌గా కనగరాజ్ నియామకం అభ్యంతరకరమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.

కనగరాజ్ నియామకం అభ్యంతరకరం: వర్ల రామయ్య

అమరావతి: పోలీసు కంప్లైంట్స్ సెల్ చైర్మన్‌గా కనగరాజ్ నియామకం అభ్యంతరకరమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజ్యాంగబద్ధ వ్యవస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలు కారాదని చెప్పారు. వైసీపీ పెద్దలకు అనుకూలుడైన కనగరాజ్ వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఇలాంటి అడ్డగోలు నియామకాలు. చేపట్టిందన్నారు. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని మండిపడ్డారు. ఎస్ఈసీ నీలం సాహ్ని ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారన్నారు. సీఎం జగన్ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో రాజకీయాలకు అతీతంగా నియామకాలు జరగాలని వర్ల రామయ్య చెప్పారు. 

Updated Date - 2021-06-21T22:28:25+05:30 IST