మిర్చి, తొడిమలతో కల్తీ కారం

ABN , First Publish Date - 2021-04-09T22:32:53+05:30 IST

మిర్చి, తొడిమలు కలిపి వ్యాపారులు కల్తీ కారం తయారు చేస్తున్నారని ఫుడ్, సేఫ్టీ అధికారి గౌస్

మిర్చి, తొడిమలతో కల్తీ కారం

గుంటూరు: మిర్చి, తొడిమలు కలిపి వ్యాపారులు కల్తీ కారం తయారు చేస్తున్నారని ఫుడ్, సేఫ్టీ అధికారి గౌస్ తెలిపారు. కల్తీ కారం తయారు చేస్తున్నారనే సమాచారంతో  మిర్చి యార్డు సమీపంలోని కారం మిల్లులపై దాడులు చేశామని ఆయన పేర్కొన్నారు. లేబిలింగ్ నిబంధనలకు విరుద్దంగా కారం ప్యాకేజీ చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ దాడులలో 72, 000 కేజీల కారాన్ని సీజ్ చేశామని ఆయన తెలిపారు. తాలు కాయలతో కారం తయారు చేసే విధానాన్ని వ్యాపారులు మానేయాలని ఆయన హెచ్చరించారు. యార్డులో  తాలు కాయల విక్రయాలు జరగకుండా చూడాలని వ్యాపారులకు ఆయన సూచించారు. 


Updated Date - 2021-04-09T22:32:53+05:30 IST