కడప జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం..
ABN , First Publish Date - 2021-10-29T16:55:22+05:30 IST
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం పడుతుండటంతో ఈ నెల 30న జరగాల్సిన బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో ఉపఎన్నికకు వర్షం ఏమైన ఆటంకం

కడప: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం పడుతుండటంతో ఈ నెల 30న జరగాల్సిన బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో ఉపఎన్నికకు వర్షం ఏమైన ఆటంకం కలిగిస్తుందేమోనని అధికారులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించే ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందికి భారీగా గొడుగులు, రెయిన్ కోట్లు ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.