కడప జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2021-08-10T17:24:51+05:30 IST

కడప జిల్లాలో విషాదం నెలకొంది. రాజుపాలెం మండలం పరిధిలోని వెంగలాయపల్లెలో అదృశ్యమైన...

కడప జిల్లాలో విషాదం

కడప జిల్లాలో విషాదం నెలకొంది. రాజుపాలెం మండలం పరిధిలోని వెంగలాయపల్లెలో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. ఈ నెల 7న తనూష్‌రెడ్డి (9) అదృశ్యమయ్యాడు. వెంగలాయపల్లెలో కంపచెట్లలో బాలుని మృతదేహం లభ్యమైంది. బాలుడిని హత్య చేసిన దుండగులు కంపచెట్లలో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-08-10T17:24:51+05:30 IST