జస్టిస్ శేషాద్రినాయుడు రాజీనామా
ABN , First Publish Date - 2021-08-17T08:58:02+05:30 IST
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రినాయుడు తన విధులకు
ముంబై, ఆగస్టు 16: బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రినాయుడు తన విధులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా జస్టిస్ శేషాద్రినాయుడు (59) స్వస్థలం. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్య పూర్తి చేసుకొని 1997 మార్చిలో ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆయన 2013 సెప్టెంబరులో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడినుంచి 2019 మార్చిలో బాంబే హైకోర్టుకు వచ్చారు. 2024 జూన్ వరకు పదవీకాలం ఉండగా..మూడేళ్ల ముందుగానే జస్టిస్ శేషాద్రినాయుడు రాజీనామా చేశారు.