బ్రెయిన్‌ పెరాలసిస్‌ యువతి పట్ల జస్టిస్‌ రమణ ఆప్యాయత

ABN , First Publish Date - 2021-12-26T07:35:41+05:30 IST

బ్రెయిన్‌ పెరాలసిస్‌ యువతి పట్ల జస్టిస్‌ రమణ ఆప్యాయత

బ్రెయిన్‌ పెరాలసిస్‌ యువతి పట్ల జస్టిస్‌ రమణ ఆప్యాయత

అమరావతి: జస్టిస్‌ రమణ ఉదయం 11గంటల నుంచి అతిథులను, కలిసేందుకు వచ్చినవారిని కలిశారు. బీసీ సంఘాలు, న్యాయవాదులు, పౌరసంఘాలు, అమరావతి రైతుల తరఫున ఇద్దరు ప్రతినిధులు, పాత్రికేయులు...ఇలా పలువర్గాల వారు ఆయనను కలిశారు. నిర్మల అనే యోగా టీచర్‌ తన కుమార్తెతో కలిసివచ్చారు.. ఆమె కుమార్తెకు పుట్టుకతోనే బ్రెయిన్‌ పెరాలసిస్‌ వ్యాధి వచ్చింది. అయినా వచ్చి జస్టిస్‌ రమణను కలిశారు. బ్రెయిన్‌ పెరాలసిస్‌ వచ్చినా భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నట్టు తన కుమార్తెను సీజేఐకి ఆమె తల్లి పరిచయం చేశారు. జస్టిస్‌ రమణ ఆమెను ఆప్యాయంగా పలకరించారు. శాలువా కప్పి, బొకే ఇచ్చి సత్కరించారు. 

Updated Date - 2021-12-26T07:35:41+05:30 IST