చట్టాలు సరిగా లేకపోతే కోర్టులో సవాల్ చేయొచ్చు
ABN , First Publish Date - 2021-01-20T08:47:56+05:30 IST
ప్రభుత్వాలు చేసే చట్టాలు సరిగ్గా లేనప్పుడు కోర్టులో వాటిని సవాల్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి అన్నారు. విద్యుత్ టారి్‌ఫలపై ప్రజాభిప్రాయ

నూతన వ్యవసాయ చట్టాలకూ ఇదే వర్తిస్తుంది: జస్టిస్ నాగార్జునరెడ్డి
విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు చేసే చట్టాలు సరిగ్గా లేనప్పుడు కోర్టులో వాటిని సవాల్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి అన్నారు. విద్యుత్ టారి్‌ఫలపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సంస్కరణల బిల్లును 2014 నుంచి అంతా వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఆ బిల్లును పాస్ చేసిందని, దీనిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. ఆ విషయం తమ పరిధిలో లేదని స్పష్టంచేశారు. అయితే ఏ చట్టమైనా సరే సరిగా లేకుంటే ఎవరైనా న్యాయస్థానాల్లో సవాల్ చేయవచ్చని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న వ్యవసాయ చట్టాలకు కూడా అదే వర్తిస్తుందన్నారు. ఏపీలో విద్యుత్ సంస్థల పనితీరుకు సంబంధించి ఏపీఈఆర్‌సీ కొన్ని ప్రామాణికాలను రూపొందించిందని, వాటి మేరకు పనిచేయాలని సూచించిందన్నారు.