నృసింహుని సేవలో జస్టిస్ కృష్ణమోహన్
ABN , First Publish Date - 2021-02-06T09:09:50+05:30 IST
మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులు సందర్శించారు.

మంగళగిరి, ఫిబ్రవరి 5: మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాన్ని శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులు సందర్శించారు. దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.