డేటా భద్రత బిల్లుకు జేపీసీ ఆమోదం

ABN , First Publish Date - 2021-11-23T09:47:23+05:30 IST

పౌరుల నుంచి స్పష్టమైన అనుమతి లేకపోతే వారి వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకోవడానికి వీలు కాని ‘వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’కు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు 200కు పైగా సవరణలు, 93 సూచనలు..

డేటా భద్రత బిల్లుకు జేపీసీ ఆమోదం

న్యూఢిల్లీ, నవంబరు 22: పౌరుల నుంచి స్పష్టమైన అనుమతి లేకపోతే వారి వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకోవడానికి వీలు కాని ‘వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’కు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు 200కు పైగా సవరణలు, 93 సూచనలు చేసినట్టు కమిటీ చైర్మన్‌ పీపీ చౌధురి తెలిపారు. దేశభద్రతకు, ప్రజల మేలు కోసం పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీ, యూఐడీఏఐ (ఆధార్‌)లను నిర్ణీత నిబంధనలతో ఈ చట్టం పరిధి నుంచీ మినహాయించవచ్చని కమిటీ సూచించింది. అలాగే.. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటివాటిని ‘ఇంటర్మీడియరీ్‌స’గా (అంటే వ్యక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించే మాధ్యమాలుగా) కాక.. ‘సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌’గా గుర్తించి, ఈ చట్టం కిందికి తేవాలని సూచించింది. డేటా భద్రత చట్టాన్ని ఉల్లంఘింస్తే చిన్న తప్పులకు రూ.5 కోట్ల దాకా జరిమానా లేదా ఆయా సంస్థల అంతర్జాతీయ ఆదాయంలో 2ు.. పెద్ద తప్పులకు రూ.15 కోట్ల జరిమానా లేదా ఆయా సంస్థల అంతర్జాతీయ ఆదాయంలో 4ు జరిమానాగా విధించాలని సూచించింది. అయితే,  ఈ బిల్లు చట్టమైతే.. అది ప్రభుత్వానికి, ప్రభుత్వ (దర్యాప్తు) సంస్థలకు అదుపులేని, అపరిమిత అధికారాలను ఇస్తుందని కాంగ్రె్‌స నేతలు అసమ్మతి వ్యక్తం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ జైరామ్‌ రమేశ్‌ డిసెంట్‌ నోట్‌ ఇచ్చినప్పటికీ.. కమిటీ ప్రజాస్వామిక విధానంతో వ్యవహరించిన తీరును ఆయన కొనియాడారు. అయితే.. బిల్లులోని 12, 35 సెక్షన్లకు ఆయన సవరణలు సూచించారు. వాటిలో సెక్షన్‌ 35, ప్రభుత్వ సంస్థలకు ఈ చట్టం నుంచి మినహాయింపునిచ్చే అపరిమిత అధికారాలను కేంద్రానికి కట్టబెడుతుందని, అందుకు కేంద్రం పార్లమెంటు అనుమతి తీసుకునేలా మార్చాలని తాను సూచించినట్టు తెలిపారు.

Updated Date - 2021-11-23T09:47:23+05:30 IST