కాంగ్రెస్‌ నుంచి జీవీ శ్రీరాజ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-21T09:23:37+05:30 IST

మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తనయుడు, యువజన కాంగ్రెస్‌ నేత జీవీ శ్రీరాజ్‌ను పార్టీ నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది

కాంగ్రెస్‌ నుంచి జీవీ శ్రీరాజ్‌ సస్పెన్షన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తనయుడు, యువజన కాంగ్రెస్‌ నేత జీవీ శ్రీరాజ్‌ను పార్టీ నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. రాహుల్‌గాంధీ ట్విటర్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసినందుకు నిరసనగా శ్రీరాజ్‌ ఒక పిట్టను  వేయించి, ముంబైలోని ట్విటర్‌ కార్యాలయానికి కొరియర్‌ చేశారు. రాహుల్‌ ఖాతాను బ్లాక్‌ చేసి, ట్విటర్‌ తప్పుచేసిందని సందేశం పంపించారు. ఆయన పిట్ట వంట చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ట్విటర్‌ డిష్‌ వండి, ఆ సంస్థ కార్యాలయానికి కొరియర్‌ ద్వారా పంపించారని వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. శ్రీరాజ్‌ వ్యవహారశైలితో రాహుల్‌గాంధీ ప్రతిష్ఠను దిగజార్చినట్లు భావించింది. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమే కాకుండా, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 


Updated Date - 2021-08-21T09:23:37+05:30 IST