ఈ విజయం ప్రజలది : జేసీ ప్రభాకర్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-14T20:47:04+05:30 IST

మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజలదని, వారికి పాదాభివందనం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత

ఈ విజయం ప్రజలది : జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం : మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజలదని, వారికి పాదాభివందనం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి అన్నారు. ‘సేవ్ తాడిపత్రి’ అన్న పదం ప్రజల నుంచే వచ్చిందని, అందుకే ఈ స్థాయిలో విజయం వరించిందని తెలిపారు. రెండు సంవత్సరాల పాలనను బేరీజు వేసుకొని, టీడీపీ అండగా ఉంటారన్న నమ్మకంతోనే ప్రజలు టీడీపీకి ఓట్లు వేశారని అన్నారు. తాడిపత్రి ప్రజలు అభ్యర్థిని చూడలేదని, తాడిపత్రిని కాపాడుకోవాలన్న ఏకైక ధ్యేయంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాడిపత్రి ప్రజలను, ఎమ్మెల్యేను కలుపుకొని, ఒకే పార్టీగా పనిచేస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని జేసీ ప్రభాకర రెడ్డి హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-03-14T20:47:04+05:30 IST