తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చూశాకైనా..: జవహర్

ABN , First Publish Date - 2021-03-22T20:46:19+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చూశాకైనా ఏపీ ఉద్యోగ సంఘం నాయకులు, మేధావులు మౌనం వీడాలి..ఉద్యోగుల హక్కులను సాధించడానికి పోరాటానికి సిద్ధపడాలని ..

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చూశాకైనా..: జవహర్

అమరావతి: తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చూశాకైనా ఏపీ ఉద్యోగ సంఘం నాయకులు, మేధావులు మౌనం వీడాలి.. ఉద్యోగుల హక్కులను సాధించడం కోసం పోరాటానికి సిద్ధపడాలని తెలుగుదేశం సీనియర్ నేత జవహర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం మించిపోయిందన్నారు. వారంలో రద్దు అన్న సీపీఎస్ కొండెక్కిందన్నారు. నిత్యావసర సరుకులు ఆకాశం వైపు పరుగెడుతున్నాయని  జవహర్ చెప్పారు.


ఉద్యోగ సంఘం నాయకులు సామాన్య ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని హక్కులకై పోరాడాలని వ్యాఖ్యానించారు. ఏపీ ఉద్యోగ సంఘం నాయకులు ప్రాతినిధ్యాలను పక్కన పెట్టారు, పోరాటాలు మరిచిపోయారు.. ఇప్పటికైనా ప్రభుత్వంపై పీఆర్సీ కోసం పోరాటం ప్రారంభించాలన్నారు. ఫిట్మెంట్ తగ్గకుండా పోరాడాలని చెప్పారు. కష్టాల్లో ఉన్నపుడు గత ప్రభుత్వం ఉదారంగ ప్రకటించిన ఫిట్మెంట్ కన్నా ఎక్కువ సాధించాలని జవహర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-22T20:46:19+05:30 IST