దళితులపై దాడులకు సీఎం సమాధానం చెప్పాలి: జవహర్

ABN , First Publish Date - 2021-08-10T16:16:27+05:30 IST

దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితులపై ధమనకాండ కొనసాగించటం ఆపాలని జవహర్ డిమాండ్ చేశారు.

దళితులపై దాడులకు సీఎం సమాధానం చెప్పాలి: జవహర్

అమరావతి: దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితులపై ధమనకాండ కొనసాగించటం ఆపాలని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిపై జగన్ అక్కసుకు కారణం తెలపాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో దళితులపై జరిగిన దాడులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. దళితులకు పెట్టిన కార్పొరేషన్‌లకు కేటాయించిన నిధులు శూన్యమన్నారు. దళితుల విద్యకు మంగళం పాడింది నిజంకాదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్య ఎందుకు ఆపారన్నారు. దళిత హక్కులను కాలరాయటమే సీఎం జగన్ ఎజెండాగా మారిందని, ప్రతిఘటన నిలువరించామని అనుకుంటే పొరపడినట్టేనని జవహర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-10T16:16:27+05:30 IST