భారత్‌లో విప్లవాగ్ని రగిల్చిన భగత్‌సింగ్‌: పవన్‌

ABN , First Publish Date - 2021-03-24T09:48:49+05:30 IST

అఖండ భారతావనిలో విప్లవాగ్ని రగిల్చిన త్యాగశీలి భగత్‌సింగ్‌ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. ఆ మహనీయుని ఆత్మబలిదానానికి

భారత్‌లో విప్లవాగ్ని రగిల్చిన భగత్‌సింగ్‌: పవన్‌

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అఖండ భారతావనిలో విప్లవాగ్ని రగిల్చిన త్యాగశీలి భగత్‌సింగ్‌ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. ఆ మహనీయుని ఆత్మబలిదానానికి మార్చి 23తో 90 ఏళ్లు నిండాయన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్‌తోపాటు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు పవన్‌ జోహార్లు అర్పించారు. 23 ఏళ్ల వయస్సులోనే ప్రపంచంలోని ఇజాలలో నిజాన్ని గ్రహించిన మేధావి భగత్‌సింగ్‌ అని అన్నారు. ‘నా విడుదల కంటే పోయే నా ప్రాణాలే బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని కూలదోస్తాయి’ అని పలికిన ధీశాలి భగత్‌సింగ్‌ అని కీర్తించారు. అలాంటి మహనీయుల దేశభక్తిని, సేవా నిరతిని ఆకళింపు చేసుకుంటేనే భారత్‌ను ప్రగతిశీల మార్గంలోకి తీసుకువెళ్లగలమని పవన్‌ చెప్పారు.

Updated Date - 2021-03-24T09:48:49+05:30 IST