రామతీర్థంలో ఘటన జరిగి వారాలు గడుస్తున్నా..: పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2021-01-13T21:22:55+05:30 IST

రామతీర్థంలో ఘటన జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

రామతీర్థంలో ఘటన జరిగి వారాలు గడుస్తున్నా..: పవన్ కళ్యాణ్

అమరావతి: రామతీర్థంలో ఘటన జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎటువంటి జఠిలమైన కేసునైనా పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారన్నారు. మరి ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో సత్వర న్యాయం జరపడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలసి ఈ కమిటీ పని చేస్తుందన్నారు. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ పోరాటంలో పాల్గొంటారని తెలిపారు. 

Updated Date - 2021-01-13T21:22:55+05:30 IST