ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: పవన్‌

ABN , First Publish Date - 2021-10-20T09:19:03+05:30 IST

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: పవన్‌

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు: పవన్‌

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి ఒక పార్టీ కార్యాలయంపై దాడులు జరిగాయి. ఇలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం క్షేమకరం కాదు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.


భౌతిక దాడులు సమర్థనీయం కాదు: సీపీఎం మధు

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులను సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మంగళవారం కోరారు. టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే, దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. కాగా.. టీడీపీ కార్యాలయాలు, నేతలపై దాడులకు పాల్పడడాన్ని సెంట్రల్‌ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ ఖండించారు. టీడీపీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లాఅండ్‌ ఆర్డర్‌ కానీ, రూల్‌ ఆఫ్‌లా గానీ లేవని ప్రముఖ న్యాయవాది, ఏపీ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు విమర్శించారు. 


మీడియాపై దాడులు అమానుషం: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడుల సందర్భంగా అక్కడ విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపైనా దాడి చేయడాన్ని ఏపీ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే), జర్నలిస్టు అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ (జాప్‌) తీవ్రంగా ఖండించాయి. ’

Updated Date - 2021-10-20T09:19:03+05:30 IST