ఆడపిల్లలందరూ మన అక్కచెల్లెళ్లే: పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2021-08-22T01:34:49+05:30 IST

రాష్ట్రంలోని ఆడపిల్లలందరూ మన అక్కచెల్లెళ్లనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలని

ఆడపిల్లలందరూ మన అక్కచెల్లెళ్లే: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: రాష్ట్రంలోని ఆడపిల్లలందరూ మన అక్కచెల్లెళ్లనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రమ్య హత్య, రాములమ్మపై హత్యాయత్నం ఘటనలు తనను తీవ్రంగా కలచివేసాయన్నారు. పట్టపగలు ఆడబిడ్డలపై నడిరోడ్డుపై జరుగుతున్న హత్యాచారాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదే నిజమైన రక్షా బంధన్ అని ఆయన పేర్కొన్నారు. సోదర, సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను పవన్‌ తెలిపారు. 

Updated Date - 2021-08-22T01:34:49+05:30 IST