రోడ్ల దుస్థితిపై ఆందోళనకు జనసేన సన్నద్ధం

ABN , First Publish Date - 2021-09-02T09:31:59+05:30 IST

రోడ్ల దుస్థితిపై ఆందోళనకు జనసేన సన్నద్ధం

రోడ్ల దుస్థితిపై ఆందోళనకు జనసేన  సన్నద్ధం

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అడుగుకో గుంత.. గజానికో గొయ్యి మాదిరిగా తయారైందని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. రహదారుల ఆధ్వాన్న పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబరు 2,3,4 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి జనసైనికుడు, వీర మహిళ... పాడైన రోడ్ల ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలని కోరారు. వీటిని చూసికూడా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు 2న మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-09-02T09:31:59+05:30 IST