విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే.. Janasena సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-12T19:44:35+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే.. Janasena సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే.. Janasena సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

అమరావతి : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న నిరసనకు జనసేన సంఘీభావం తెలిపింది. ఆదివారం నాడు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో మరికాసేపట్లో దీక్ష ప్రారంభం కానుంది. ఈ క్రమంలో జనసేన సీనియర్ నేత పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి తూర్పుగోదావరి జిల్లా రైతులు సంఘీభావం తెలుపుతున్నారని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే ఏలేరు కాల్వ గేట్లు మూసేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.


నీరు ఆపేస్తే..!

స్టీల్ ప్లాంట్ కోసమే గతంలో మేం ప్రభుత్వం ఎంతిస్తే అంత పరిహరం తీసుకుని భూములిచ్చాం. మాకు తాగు, సాగు నీరుతో ఇబ్బందున్నా.. స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశాం. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే మా నీటిని విశాఖ ప్రజలకిస్తాం కానీ.. స్టీల్ ప్లాంటుకు ఇవ్వం. రోజుకు 300 క్యూసెక్కుల నీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సరఫరా అవుతోంది. ఆ నీటిని ఆపేస్తే మా జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది అని నానాజీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Updated Date - 2021-12-12T19:44:35+05:30 IST