జగన్‌రెడ్డి అరాచక పాలనపై తిరుగుబాటు!

ABN , First Publish Date - 2021-12-30T08:46:59+05:30 IST

జగన్‌రెడ్డి అరాచక పాలనపై దళితులను చైతన్యవంతం చేసి, ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలకు సిద్ధం చేయడానికి జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రతిఘటన సదస్సులు జరుపనున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు తెలిపారు.

జగన్‌రెడ్డి అరాచక పాలనపై తిరుగుబాటు!

3 నుంచి దళిత ప్రతిఘటన సదస్సులు: టీడీపీ ఎస్సీ సెల్‌ 

గన్‌రెడ్డి అరాచక పాలనపై దళితులను చైతన్యవంతం చేసి, ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలకు సిద్ధం చేయడానికి  జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా దళిత ప్రతిఘటన సదస్సులు జరుపనున్నట్లు టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు తెలిపారు. ఫిబ్రవరిలో మహాసభ నిర్వహిస్తామన్నారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో సదస్సుల సన్నాహాక సమావేశం జరిగింది.  ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాలనలో దళితులపై 4,950నేరాలు జరిగాయని స్వయంగా డీజీపీ ప్రకటించారని గుర్తు చేశారు. అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2021-12-30T08:46:59+05:30 IST